ఆదివారం విత్ స్టార్ మా పరివారం మంచి జోష్ తో ఆడియన్స్ ని నవ్విస్తూ ఉంటుంది. ఇందులో గేమ్ షోస్, డాన్స్, సింగింగ్ అన్ని ఎలిమెంట్స్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. శ్రీముఖి హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక ఈ వారం ఈ ఎపిసోడ్ లో బీబీ జోడి టీమ్స్ వచ్చి సందడి చేశాయి. అలాగే ఈ స్టేజి మీద "బుట్టబొమ్మ" మూవీ టీమ్ వచ్చింది.. అర్జున్ దాస్, నవ్య స్వామి, అనైక, సూర్య వచ్చారు. ఫైమా అర్జున్ దాస్ తో ఇంగ్లీష్ లో మాట్లాడి ఫన్ క్రియేట్ చేసింది. ఆయనతో కలిసి "బుట్టబొమ్మ బుట్టబొమ్మ " అనే సాంగ్ కి డాన్స్ చేసింది. "మీ మూవీని పైరసీ చేయొద్దని థియేటర్స్ లో చూడమని చెప్తాను" అని అంది. తర్వాత అవినాష్ అనైకతో కలిసి "బుట్టబొమ్మ" సాంగ్ కి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసాడు.
తర్వాత అర్జున్ దాస్ తో వాయిస్ ని ఇమిటేట్ చేసి "థ్యాంక్యూ సోమచ్..అవును మీరు బిగ్ బాస్ సీజన్ 7 కి బిగ్ బాస్ వాయిస్ కి ఎందుకు ట్రై చేయకూడదు ? అని అవినాష్ అడిగేసరికి "నో హి ఈజ్ నాట్ ఇంట్రెస్టేడ్ ..నువ్వు వెళ్ళు" అంది పంపించేసింది శ్రీముఖి. ధమాకా టీమ్ పాయింట్స్ తెచ్చుకునేసరికి పటాకా టీమ్ ఓడిపోయింది. దాంతో వాళ్లకు పనిషమెంట్ ఇచ్చింది శ్రీముఖి. పనిషమెంట్ లో భాగంగా భానుశ్రీని సైకిల్ మీద ఎక్కించుకుని రవికృష్ణ స్టేజి మీద ఉన్న సర్కిల్ చుట్టూ తిరిగాడు.